క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ యూత్ ఐకాన్ అనే చెప్పాలి. ఈ సంవత్సరం విడుదలైన ‘గీత గోవిందం’ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన విజయ్.. ఇటీవలే విడుదలైన ‘టాక్సీవాలా’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో తన స్టార్ డమ్ ఏంటో మళ్లీ చూపించుకున్నాడు.
కాగా తాజాగా విజయ్ దేవరకొండ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బిజినెస్ గురించి రివీల్ చేశాడు. తన క్లాతింగ్ లైన్ ‘రౌడీ వియర్’ కంపెనీ ఎదుగుతోందని.. రానున్న రెండేళ్లలో తన కంపెనీ 100 కోట్ల కంపెనీ అవుతుందని చెప్పుకొచ్చాడు. అలాగే తాను స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ నుండి కూడా త్వరలోనే ప్రాజెక్ట్స్ మొదలవుతాయని విజయ్ తెలిపాడు.
ఇక న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు విజయ్ సమాధానమిస్తూ.. ఫోన్ పని చేయని ఓ దీవిలో సుమారు పది రోజులు ఎవరితో సంబంధం లేకుండా గడపబోతున్నానని విజయ్ చెప్పాడు.


