ఆకట్టుకుంటున్న ‘రాజన్న నిన్నాపగలరా’ సాంగ్ !

ఆకట్టుకుంటున్న ‘రాజన్న నిన్నాపగలరా’ సాంగ్ !

Published on Jan 2, 2019 3:00 AM IST

rajanna2

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం నుండి న్యూ ఇయర్ కానుకగా ఈ రోజుసాయంత్రం 5గంటలకు ‘రాజన్న నిన్నాపగలరా ‘ అనే లిరికల్ సాంగ్ విడుదల అయింది.

సాంగ్ లో ప్రధానంగా వైఎస్సార్ పాత్ర గొప్పదనం గురించి లిరిక్స్ ఉన్నాయి, ఈ సాంగ్ ని సిరివెన్నెల సీతారామశాస్ట్రీ రాశారు. ప్రస్తుతం ఈ పాట వైఎస్సార్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ‘యాత్ర’ చిత్రం ఫిబ్రవరి 8న విడుదలవుతుందని ఇటీవలే చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. అలాగే సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

తాజా వార్తలు