
టాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ ని కోలీవుడ్లో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా ‘వర్మ’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను స్టార్ హీరో సూర్య విడుదలచేయనున్నారు. జనవరి 9న ఈ ట్రైలర్ విడుదలకానుంది. ప్రముఖ దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కు జోడిగా బెంగాలీ భామ మేఘ చౌదరి నటిస్తుంది.
ఈ4 ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఒరిజినల్ వర్షన్ కు సంగీతం అందించిన రధాన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా శక్తి ఫిలిం ఫ్యాక్టరీ విడుదల చేయనుంది. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకులముందుకు రానుంది.

