‘అల్లు అర్జున్’ సరసన ‘రామ్ చరణ్’ హీరోయిన్ !

‘అల్లు అర్జున్’ సరసన ‘రామ్ చరణ్’ హీరోయిన్ !

Published on Jan 3, 2019 7:07 PM IST

Kiara Advani

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత వీరిద్దరూ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా ఇది. కాగా ఈ సినిమాలో బన్నీ సరసన నటించే హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు ముమ్మరంగా వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నకి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. ప్రస్తుతం ఆమె మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా ‘వినయ విధేయ రామ’లో నటించింది. ఈ చిత్రం జనవరి 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక బన్నీ త్రివిక్రమ్ సినిమా 2019 జనవరిలో చిత్రం ప్రారంభవ్వనుంది.

తాజా వార్తలు