‘సర్కార్’ తరువాత ఇళయదళపతి విజయ్ నటించనున్న 63వ చిత్రం ఇటీవలే లాంచ్ అయ్యింది. విజయ్ కి ‘తెరి ,మెర్సల్’ రుపంలో రెండు బ్లాక్ బ్లాస్టర్ విజయాలను అందించిన యువ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈ నెల 21న లేదా 22 న కానీ స్టార్ట్ కానుంది. మొదటి షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్ భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ కోచ్ పాత్రలో కొత్త లుక్ లో కనిపించనున్నాడు.
భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రంలో నయనతార కథానాయిక నటించనుంది. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఇక దీపావళి కి విజయ్ నటించిన సినీమాలు విడుదలై మంచి విజయం సాధించడంతో ఈ చిత్రాన్ని కూడా అదే సమయానికి విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.


