‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రీ రిలీజ్ వేడుక.. ముఖ్య అతిథిగా వి.వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రీ రిలీజ్ వేడుక.. ముఖ్య అతిథిగా వి.వి. వినాయక్

Published on Aug 31, 2026 6:00 AM IST

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మించిన పొలిటికల్ డ్రామా ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న పీవీఆర్, ఐనాక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రధాన సమస్యగా మారిన డ్రగ్స్‌ అంశాన్ని ఎత్తిచూపుతూ దర్శకుడు ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారని ప్రశంసించారు. చంద్రబోస్ సాహిత్యం, చిత్ర కథాంశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘రంగస్థలం’ తర్వాత కథకు అనుగుణంగా ఐదు పాటలు రాసే పూర్తి స్వేచ్ఛ, సంతృప్తి ఈ సినిమాతోనే లభించిందని తెలిపారు.

ఈ చిత్రంతో నటుడు సత్యప్రకాష్ తనయుడు నటరాజ్ హీరోగా పరిచయమవుతున్నారు. వితికా షేరు, సాయికుమార్, సుమన్, రాజీవ్ కనకాల, కస్తూరి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఒక యదార్థ సంఘటన ఆధారంగా కమర్షియల్ అంశాలతో పాటు చక్కటి సందేశాన్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు జై జ్ఞాన ప్రభ వెల్లడించారు. ఈ సినిమాకి మహావీర్ ఏలేందర్ సంగీతం సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు