తల అజిత్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో నటించనున్నాడని తెలిసిందే. హెచ్ వినోత్ తెరకెక్కించనున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ ఫిబ్రవరి లో మొదలు కానుంది. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో జరుగనుంది. ఇంతకుముందు అజిత్ నటించిన విశ్వాసం కూడా ఎక్కువ భాగం షూటింగ్ అక్కడే జరుపుకుంది. ఇక పింక్ లో తాప్సీ పన్ను చేసిన పాత్రను కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటి విద్యా బాలన్ కూడా ఈచిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించనుంది.
బోనీకపూర్ నిర్మించనున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా ఈచిత్రానికి సంగీతం అందించనున్నారు. మే 1 న ఈ చిత్రం విడుదలకానుంది. ఇక అజిత్ నటించిన విశ్వాసం నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది.


