బ్లాక్ బ్లాస్టర్ మల్టీ స్టారర్ ఎఫ్ ఇప్పటికే యూఎస్ లో 2 మిలియన్ల పైగా వసూళ్లను రాబట్టి భారీ లాభాలను తీసుకొచ్చింది. ఈచిత్రం సోమవారం రాత్రి 8:30 గంటల వరకు $1,879 వసూళ్లను రాబట్టింది.
ఇక యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన మూడవ చిత్రం మిస్టర్ మజ్ను యూ ఎస్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తుంది. సోమవారం ఈచిత్రం రాత్రి 8:30 వరకు కేవలం 1,446 డాలర్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఈచిత్రం అక్కడ 3. 75కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది మరి ఇదే రన్ ను కనబరిస్తే మాత్రం ఈ చిత్రం అక్కడ నష్టాలను తీసుకురావడం ఖాయం.
ఇక ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి సీజన్ లో విడుదలై మంచి రివ్యూస్ ను తెచ్చుకున్న కూడా కలెక్షన్స్ పరంగా చాలా నిరాశపరించింది. ఈచిత్రం ఓవర్సీస్ లో $9,28,005 వసూళ్లను రాబట్టి రన్ ను ముగించింది. దాంతో అక్కడ ఈచిత్రం 50శాతం నష్టాలను తీసుకొచ్చింది.


