టీడీపీ అధికారిక ప్రకటనలో ‘మహానాయకుడు’ !

టీడీపీ అధికారిక ప్రకటనలో ‘మహానాయకుడు’ !

Published on Jan 31, 2019 6:13 PM IST

mahanayakudu1

‘మహానాయకుడు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని మొట్టమొదటి సారిగా అధికారికంగా ప్రకటించిన తాలూకు సన్నివేశాలను క్రిష్ ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సన్నివేశాల్లో బాలయ్యతో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొన్నారు.

అలాగే ఎన్టీఆర్ హరికృష్ణతో కలిసి చైతన్య రథం పై చైతన్య యాత్ర పేరుతో రాష్ట్రం అంతా పర్యటించిన విషయం తెలిసిందే. తరువాత వారంలో క్రిష్ ఈ సన్నివేశాలను సారధి స్టూడియోలోతెరకెక్కిస్తారట. ఈ సన్నివేశాల్లో వేలాదిమంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు.

ఇక ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై, పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను మాత్రం పెద్దగా రాబట్టుకోలేపోయింది. మరి సెకెండ్ పార్ట్ అన్న.. భారీ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

తాజా వార్తలు