బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త రాకేష్శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ లో నటించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు షారుఖ్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడట. దాంతో ఆయన స్థానంలో యూరి : ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ విక్కీ కౌశల్ ను తీసుకోనున్నారని సమాచారం. ‘సెల్యూట్’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విక్కీ , రాకేష్ శర్మ పాత్రలో కనిపించనున్నాడు.
మహేష్ మతాహి తెరకెక్కించనున్న ఈచిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. భారీ బడ్జెట్ తో సిద్దార్ధ రాయ్ కపూర్,రోనీ స్క్రివలా ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.


