రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనల నడుమ రన్ అవుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది.
రెండో రోజు తగ్గిన జోరు
తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.135 కోట్ల భారీ గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం, రెండో రోజు మాత్రం తీవ్రమైన డ్రాప్‌ను చూసింది. డే 2 రోజున ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.45 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయడంతో మొత్తంగా రెండు రోజుల కలెక్షన్లు రూ.180 కోట్లకు చేరాయి.
భాషల వారీగా చూసుకుంటే.. రెండో రోజు హిందీ వెర్షన్ రూ.26 కోట్లు రాబట్టి కొంతవరకు నిలకడ చూపించగా, సొంత గడ్డ కన్నడలో రూ.9 కోట్లు, తెలుగులో రూ.3 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లలో గణనీయమైన క్షీణత కనిపించింది. రాబోయే వీకెండ్, సెలవు దినాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు పుంజుకుంటుందో చూడాలి.


