పాపులర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఆల్ఫా’

పాపులర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఆల్ఫా’

Published on Aug 28, 2026 1:01 PM IST

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో మరో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శర్వరి మరో ముఖ్య పాత్రలో దర్శకుడు శివ్ రవైల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రమే ఆల్ఫా. బాలీవుడ్ పాపులర్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా ఈ యూనివర్స్ సినిమాల్లోనే వీక్ గా నిలిచి ప్లాప్ గా మారింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.

ఈ సినిమాని పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నేటి నుంచి ఈ సినిమా అందులో అందుబాటులోకి వచ్చేసింది. పాన్ ఇండియా భాషల్లో థియేట్రికల్ గా ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. సో ఈ సినిమా చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించగా హృతిక్ రోషన్ చిన్న కామియోలో కనిపించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు