తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , పురుచ్చితలైవి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఐరన్ లేడీ’ . లేడీ డైరెక్టర్ ప్రియదర్శిని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో నిత్య మీనన్ నటిస్తుంది . ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 10కోట్ల బడ్జెట్ తో పేపర్ టేల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లెజండరీ యాక్టర్ ఎమ్ జి ఆర్ పాత్రను మలయాళ నటుడు సుగుమార్ పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 20న 2020 లో విడుదలకానుందని మేకర్స్ ప్రకటించారు.
ఇక తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ కూడా జయలలిత మీద బయోపిక్ ను తెరకెక్కించనున్నాడు. ‘తలైవి’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో విడుదలకానుంది.


