
ఇటీవలే వచ్చిన ‘లవర్స్ డే’ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది నూరిన్ షరీఫ్. నటన పరంగా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం నూరిన్ షరీఫ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో నూరిన్ షరీఫ్ మాట్లాడుతూ.. అందరిలానే అల్లు అర్జున్ అంటే తనకూ బాగా ఇష్టమని, తను కూడా బన్నికి పెద్ద ఫ్యాన్ అని.. లవర్స్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ రావడంతో తనకు చాలా సంతోషంగా అనిపించిందని.. ఓ సందర్భంలో ఆయన్ను పెళ్లాడాలనిపించిందని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఈ కామెంట్స్ ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

