నాగసాయి మాకం దర్శకత్వంలో యంగ్ హీరో మాగంటి శ్రీనాథ్ నటించిన కొత్త చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ఈసినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహకాంళీ శ్రీనివాస్ నిర్మించారు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుందని శ్రీనాథ్ చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ…అంకుశం లాంటి సినిమాల నుంచి పోలీసు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వాటి సత్తా చూపిస్తున్నాయి. నా దృష్టిలో పోలీసులు రియల్ హీరోలు. వాళ్లు లేకుండా ఒక్క గంట సమాజాన్ని ఊహించలేం. అనేక నేరాలు, అరాచకాలు జరుగుతాయి. అందుకే నాకు ప్రతి పోలీసు అధికారి అంటే అభిమానం. ఒక్క పోలీసులే కాదు చట్టాన్ని రక్షించే ప్రతి ఒక్కరూ హీరోలే.
ఈచిత్రంలో నేను పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటించాను. బిలాల్ పూర్ అనే ఊరికి కొత్తగా పోలీసు అధికారిగా వెళ్లిన నాకు అక్కడ ఎలాంటి వింత వింత కేసులు ఎదురయ్యాయి, అవి నన్ను ఎలా అసహనానికి గురి చేశాయి అనేది వినోదాత్మకంగా ఉంటుందన్నారు.


