ఓవర్సీస్ లో సాహో క్రేజ్ మాములుగా లేదుగా !

ఓవర్సీస్ లో సాహో క్రేజ్ మాములుగా లేదుగా !

Published on Mar 7, 2019 5:28 PM IST

Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క మేకింగ్ టీజర్ లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ లో రేంజ్ లో సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం తో ఇండియా తోపాటు ఓవర్సీస్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ చిత్రం చైనా మినహా ఓవర్సీస్ లో 36 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఒక ఇండియన్ సినిమా కి ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ఇదే మొదటి సారి.

భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ కథానాయికగా నటిస్తుంది. శంకర్-ఎహసాన్ -లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 15 న తెలుగు తోపాటు ఇతర భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు