పండుగను టార్గెట్ చేసిన సూర్య !

పండుగను టార్గెట్ చేసిన సూర్య !

Published on Mar 7, 2019 8:27 PM IST

Surya1

విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం ఎన్ జి కె. ఇటీవల షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే అనుకున్నతంగా వేగంగా ఈ పనులు పూర్తి కావడం లేదు. దాంతో సినిమాను ఆలస్యంగా విడుదలచేయనున్నారు.

ఇక ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా జూన్ 5 న కానీ లేదా 6 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే ఈ విడుదల తేదీ ఫై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ సూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. దాంతో సినిమా ఫై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

తాజా వార్తలు