‘ప్రేమకథా చిత్రమ్ 2’ ట్రైలర్ విడుదలకానుంది !

‘ప్రేమకథా చిత్రమ్ 2’ ట్రైలర్ విడుదలకానుంది !

Published on Mar 8, 2019 2:00 AM IST

Prema Katha Chitram 2

సూపర్ హిట్ హార్రర్ కామెడీ మూవీ ‘ప్రేమకథా చిత్రమ్’ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమ కథా చిత్రమ్ 2’. నూతన దర్శకుడు హరికిషన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది.

ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదలచేయనున్నారు. ఆర్ పి ఏ క్రీయేషన్స్ పతాకం ఫై సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈచిత్రంలో ప్రభాస్ శ్రీను , విద్యుల్లేక రామన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరిమధ్య వచ్చే సన్నివేశాలు హీలేరియస్ గా వుండనున్నాయట. జేబీ సంగీతం అందిస్తున్ ఈ చిత్రం మార్చి 21న విడుదలకానుంది.

తాజా వార్తలు