వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన కమెడియన్స్ !

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన కమెడియన్స్ !

Published on Mar 9, 2019 10:53 PM IST

VIV

లక్ష్మి రాయ్ ,మధునందన్ , ప్రవీణ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. కిషోర్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రవీణ్ , మధు మీడియా తో సినిమా గురించి ఆసక్తిర విషయాలను వెల్లడించారు.

ఈ కథ విన్నాక సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నాం. కథ బాగా నచ్చింది. మా ఇద్దరిని తీసుకున్నాకే లక్ష్మి రాయ్ ని తీసుకున్నారు. కథ విషయానికే వస్తే ఊరికి మేమిద్దరం సమస్య అవుతాం. లక్ష్మి రాయ్ ఆ ఊరికి టీచర్ గా వస్తుంది. ఆ ఆతరువాత మమల్ని ఊరికి ఉపయోగ పడేలా ఎలా మార్చింది అనేదే మిగితా కథ. మా ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు హీలేరియాస్ అలాగే ఎమోషనల్ గా ఉంటాయి. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని నమ్ముతున్నామని అన్నారు.

తాజా వార్తలు