నాని నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా జెర్సీ ఏప్రిల్ 19న విడుదలకానుందని తెలిసిందే. ఇక ఈ చిత్రానికి కి పోటీగా ఒక తమిళ చిత్రం విడుదలకానుంది. ముని సీరిస్ లో భాగంగా రాఘవ లారెన్స్ నటించిన కాంచన , గంగ చిత్రాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సిరీస్ కు సీక్వెల్ గా కాంచన 3 అనే చిత్రం తెరకెక్కుతుంది. లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో వేదిక, ఓవియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం కూడా తమిళం తోపాటు తెలుగులో ఏప్రిల్ 19న విడుదలకానుంది. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదలచేస్తున్నారు. మరి ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద జెర్సీ కి ఏ రేంజ్ లో పోటీనిస్తుందో చూడాలి.


