ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ కు టైటిల్ ఫిక్స్ !

ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ కు టైటిల్ ఫిక్స్ !

Published on Mar 27, 2019 6:01 PM IST

RX100

తెలుగులో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించిన బోల్డ్ మూవీ ఆర్ఎక్స్ 100 ఇప్పుడు హిందీలో రీమేక్ లో కానుందని తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి ఈ సినిమా తో హీరోగా పరిచయం కానున్నాడు.

మిలాన్ లుథ్రియా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి తడప్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సాజిద్ నడియాద్వాల నిర్మించనున్న ఈ చిత్రంలో తార సుతారియా హీరోయిన్ గా నటించనుంది. మే లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ చిత్రం బాలీవుడ్ లో ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు