మహర్షి మొదటి సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ !

మహర్షి మొదటి సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ !

Published on Mar 30, 2019 12:29 AM IST

Maharshi

భరత్ అనే నేను తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రం ‘మహర్షి’ ఇటీవల టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. మరో రెండు సాంగ్స్ షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ కానుంది. ఇక ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతుండగానే మరో వైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది చిత్ర యూనిట్. అందులో భాగంగా ఈ రోజు ఈచిత్రం నుండి ‘ చోటి చోటి’ అంటూ సాగె మొదటి సాంగ్ కను విడుదలచేశారు. ఈసాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. శ్రీమణి లిరిక్స్ కు దేవి శ్రీ ప్రసాద్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు అంతేకాకుండా ఈసాంగ్ కూడా ఆయనే పాడారు.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు