సీత టీజర్ విడుదలకానుంది !

సీత టీజర్ విడుదలకానుంది !

Published on Mar 30, 2019 12:03 PM IST

Sita12

యువహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీత’ షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. తేజ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో టైటిల్ రోల్ లో కాజల్ నటిస్తుండగా రామ్ పాత్రలో సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను ఈ రోజు అమరావతి లోని వీఆర్ సిద్దార్థ కళాశాలలో లాంచ్ చేయనున్నారు.

ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో మన్నార చోప్రా , సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదలకానుంది. ఇక కవచం తరువాత సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటించడం ఇది రెండవసారి. మరి ఈ చిత్రం తోనైనా హిట్ పెయిర్ అనిపించుకుంటారో లేదో చూడాలి.

తాజా వార్తలు