హలో తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం సౌత్ లో బిజీగా హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ‘హాలో’ తరువాత ‘చిత్రలహరి’ లో నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది. ఈ సినిమా తో పాటు కళ్యాణి మలయాళం లో మరక్కార్ అనే చిత్రంలో నటిస్తుంది
ఇక తెలుగు , మళయాళమే కాకుండా ఇటీవల కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో హీరో అనే సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పింది కళ్యాణి. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు యంగ్ హీరో శింబు తో ‘మాన్నాడు’ అనే పొలిటికల్ డ్రామా ను తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించనుంది.


