“ధురంధర్ 2” రిలీజ్ కి ముందు లాస్ట్ మినిట్ ట్విస్ట్?

“ధురంధర్ 2” రిలీజ్ కి ముందు లాస్ట్ మినిట్ ట్విస్ట్?

Published on Mar 18, 2026 8:00 AM IST

Dhurandhar

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ సీక్వెల్ చిత్రమే “ధురంధర్ ది రివెంజ్”. దర్శకుడు ఆదిత్య ధర్ పక్కా ప్లానింగ్ తో తెరకెక్కించి ఫినిష్ చేసిన ఈ సినిమా గ్రాండ్ గా ఇప్పుడు విడుదల కాబోతోంది. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు కూడా ఇతర పాన్ ఇండియా సినిమల్లానే చివరి నిమిషం చిక్కులు వచ్చినట్టు టాక్.

ఆ మధ్య అంతా పలు సినిమాలకి కంటెంట్ ఇంకా డెలివరీ కాలేదు అని పలు వార్తలు విన్నాం. ఇప్పుడు ఇదే ఈ సినిమాకి కూడా జరుగుతుంది అని తెలుస్తోంది. ఒక్క ఓవర్సీస్ మార్కెట్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా కూడా ధురంధర్ 2 కంటెంట్ ఇవాళ్టి ప్రీమియర్స్ కే ఇంకా చేరలేరు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ ప్రీమియర్స్ ఆన్ టైం పడతాయా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు