పవర్ ఫుల్ టైటిల్ తో రానున్న నితిన్ !

పవర్ ఫుల్ టైటిల్ తో రానున్న నితిన్ !

Published on Mar 30, 2019 2:20 PM IST

Nithiin

శ్రీనివాస కళ్యాణం తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో కృష్ణ చైతన్య తో ఒక సినిమా చేయనున్నాడు. ఈసినిమా కి పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారట. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘పవర్ పేట’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఈఏడాది చివర్లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. నితిన్ సొంత ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.

ఇక ఈ చిత్రాలతో పాటు నితిన్ ,వెంకీ కుడుములతో అలాగే సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి తో సినిమాలను చేయనున్నాడు. వీటిలో మొదటగా వెంకీ కుడుముల సినిమా స్టార్ట్ కానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు