కమల్ హాసన్ – శంకర్ కలయికలో భారతీయుడు సీక్వెల్ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ చెన్నైలో ఘనంగా ప్రారంభం అయినా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత షూటింగ్ ను ప్రారంభించినప్పటికీ.. మళ్ళీ మధ్యలోనే షూటింగ్ ను ఆపేసినట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్ విషయంలో దర్శకుడితో విభేదాల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందట.
కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించి సెట్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల షూట్ మధ్యలో ఆపాల్సి వచ్చిందట. మొత్తానికి టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని భారీ హంగులతోనే తీర్చిదిద్దుతున్నారు.
కమల్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2020లో ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది.


