తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ తేజా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్ ఆరంభంలో కొత్త నటులతో హాస్యంతో కూడిన ప్రేమ కథలు నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే ఆయన సినిమాలు రెట్టింపు కంటే ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టేవి. ఐతే ఆయనకు ఇండస్ట్రీలో ముక్కోపిగా పేరుంది. సెట్స్ లో ఆయన నటులపై చేయిచేసుకుంటారనే అపవాదు కూడా ఉన్న నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా ఓ సందర్భంలో వివరణ ఇచ్చారు.
“నువ్వు నేను” చిత్ర షూటింగ్ సమయంలో హీరోయిన్ ఏడ్చే సన్నివేశం చిత్రీకరించాల్సివుండగా ఆమెకు ఎంతకు ఏడుపు రాకపోవడంతో నేను సదరు హీరోయిన్ చెంపై గట్టిగా కొట్టారట. ఐతే అది ఆమె సరిగా నటించకపోవడం వలన తేజా కొట్టానని భావించి అపార్థం చేసుకున్నారు. నిజానికి సన్నివేశం కోసం నేను చేయిచేసుకోవలసి వచ్చిందని తేజ వివరణ ఇచ్చారు.


