పిక్ టాక్ : శిరీష్‌తో నయనిక వివాహం.. అల్లు ఫ్యామిలీలోకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన బన్నీ

పిక్ టాక్ : శిరీష్‌తో నయనిక వివాహం.. అల్లు ఫ్యామిలీలోకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన బన్నీ

Published on Mar 7, 2026 7:01 PM IST

Untitled 2

అల్లు శిరీష్ మరియు నయనిక రెడ్డిల వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నిన్న(మార్చి 6) జరిగిన పెళ్లి వేడుకలో అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్ మరియు స్నేహారెడ్డి సందడి చేశారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మార్చి 6న జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులందరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. అల్లు అర్జున్ తన సోదరుడి వివాహంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొత్త జంటను ఆశీర్వదించేందుకు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అల్లు ఫ్యామిలీలోకి నయనికకు గ్రాండ్ వెల్కమ్ అంటూ బన్నీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ వివాహ వేడుకలో మెగా మరియు అల్లు కుటుంబ సభ్యులు సంతోషంగా సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు