దాదాపు ఏడాది క్రిందట నటి శ్రీదేవి హఠాన్మరణం సినీపరిశ్రమను ఒక్కసారిగా విస్మయానికి గురిచేసింది. ఆరోగ్యంగా ఉంటూ వరుసగా సినిమాలు కూడా చేస్తున్న శ్రీదేవి మరణించడం ఏమిటని అనేక అనుమానాలు రేకెత్తాయి. ఐతే ఆమె మరణం వెనుక కారణాలు గా మద్యం మత్తులో బాత్ టబ్ లో పడి మరణించారు అనేది ఆమె అభిమానులను ఎక్కువగా కలచివేసింది. అలాంటి దిగ్గజ నటీమణికి అటువంటి దుర్భరమైన చావు రావడం కొందరు జీర్ణించుకోలేకపోయారు.
ఐతే ఆమె ప్రమాదవశాత్తు మరణించలేదని,హత్యేనని కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీపీ రిషిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత మత్తులో ఉన్నప్పటికీ ఐదున్నర అడుగుల మనిషి అడుగులోతు నీళ్లలో మునిగిపోయి మరణించడం అనేది ఆయన వాదన. శ్రీదేవి మరణం వెనుక అసలు కారణం ఎదో ఉందన్న భావన అందరిలో ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ పోలీస్ అధికారి ఆరోపణలు సంచలనంగా మారాయి. అయతే శ్రీదేవి మరణంపై వస్తున్న ఈ వార్తలను ఆమె భర్త బోనీ కపూర్ ఖండించారు. ఇటువంటి మూర్ఖపు వాదనలను ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారని ఆధారాలు లేని వీటికి స్పందించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. జరిగిందేదో జరిగిపోయింది,ఇప్పుడు ఇలాంటి రచ్చ ఎందుకు అని కొందరి వాదన.


