‘ధురంధర్ 2’ ఓపెనింగ్ డే ప్రిడిక్షన్.. ఏకంగా డబుల్ సెంచరీ మార్క్..?

‘ధురంధర్ 2’ ఓపెనింగ్ డే ప్రిడిక్షన్.. ఏకంగా డబుల్ సెంచరీ మార్క్..?

Published on Mar 8, 2026 11:00 AM IST

dhurandhar 2

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘ధురంధర్ : ది రివెంజ్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని విధంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ‘ధురంధర్ 2’ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, వారి అంచనాలను మించేలా ఈ సినిమా ఉండబోతుందని నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఎక్కడా వేలెత్తి చూపెట్టేలా ఉండకుండా ఈ సీక్వెల్ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్. ట్రైలర్ బొంబాట్‌గా ఉండటంతో పాటు పెయిడ్ ప్రీమియర్స్ అడ్వాన్ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. దీంతో ధురంధర్ 2 విధ్వంసాన్ని ముందుగా చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ కోసం ఏకంగా రెండు లక్షల టికెట్ బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన ఓపెనింగ్ రోజు వసూళ్లు వరల్డ్‌వైడ్‌గా రూ.200 కోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ధురంధర్ 2’ బాలీవుడ్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మార్చి 19న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.

తాజా వార్తలు