‘సైరా’ నరసింహారెడ్డి మనసారా మ్రొక్కిన పురాణపండ శ్రీనివాస్ ‘నిన్నే సేవింతున్’ గ్రంధం.

‘సైరా’ నరసింహారెడ్డి మనసారా మ్రొక్కిన పురాణపండ శ్రీనివాస్ ‘నిన్నే సేవింతున్’ గ్రంధం.

Published on Sep 5, 2019 10:00 AM IST

‘ పురాణపండ శ్రీనివాస్ … ‘ ఈ పేరు వినగానే అద్భుతమైన పుస్తకాలు ,అసాధారణమైన వాగ్ధాటి, అపురూప సొగసుల భాషా శైలి, నిస్వార్ధ జీవనం , ఎన్నో ఆటుపోట్ల మధ్య కూడా మొక్కవోని ధైర్యం , శ్రమైక జీవన సౌందర్యం ఇవే గుర్తొస్తాయి.

యుట్యూబ్ , వాట్సాప్ లు మన జీవితాన్ని శాసిస్తున్న ఈరోజుల్లో కూడా ఒక భక్తిపుస్తకాన్ని కన్నార్పకుండా ఎలా చదివించాలో పురాణపండ శ్రీనివాస్ కే బాగా తెలుసు.

నాణ్యతా ప్రమాణాల ముద్రణలో గానీ , మంత్రబలాల వ్యాఖ్యానాలతో కానీ , గ్రంథ ఉచితవితరణలో గానీ రాజీ పడకుండా ఖఛ్చితత్వాన్ని పాటిస్తారు శ్రీనివాస్.

డబ్బు కోసమో, డాబు కోసమో , ధనికుల కోసమో, అధికుల కోసమో బుక్స్ అమ్ముకునే వ్యాపారాత్మక కనికట్టుల ఆత్మవంచనను పురాణపండ శ్రీనివాస్ తన దగ్గరకు చేరనివ్వలేదు కాబట్టే ఉత్తమ ప్రమాణాలతో ఆయన గ్రంధాలు దేశ దేశాల తెలుగు వారికీ చేరుతున్నాయి. అందరూ అద్భుతః అంటున్నారు. కొందరు అసూయపడుతున్నారు కూడా. తాను చేసే పనిలో వున్న దైవత్వం మాత్రమే ముఖ్యమంటారాయన.

పురాణపండ శ్రీనివాస్ అనే ఒకే ఒక వ్యక్తి పడే కష్టం చూస్తే మనకు ఖచ్చితంగా కన్నీళ్లొస్తాయి. ప్రముఖ రచయితగా, అద్భుతమైన వక్తగా, మహా ప్రతిభావంతునిగా, నిస్వార్థమైన సేవకునిగా తెలుగు రాష్ట్రాలలో విశేష ప్రాచుర్యం సంపాదించుకున్న పురాణపండ శ్రీనివాస్ ప్రతీ రోజూ కనీసంగా పద్దెనిమిది గంటలు పనిచేస్తారు. అందులో తొంభై శాతం దైవీయ మార్గమే మనకు కనిపిస్తుంది. ఆయనతో పరిచయం వున్న వారెవరైనా ఈ విషయాన్ని హండ్రెడ్ పెర్సెంట్ సమర్థిస్తారు.

బంధాల్ని, అనుబంధాల్ని, స్నేహితుల్ని అన్నీ ప్రక్కకు పెట్టేసి పురాణపండ పడుతున్న కష్టం చూస్తే మనకి తీయకుండానే మన కన్నుల లోంచి కన్నీళ్లొచ్ఛేస్తాయి. నో డౌట్.

ఇటీవల వినాయక పర్వదినం సందర్భంగా శ్రీనివాస్ ప్రచురించిన ‘ నిన్నే సేవింతున్’ అపురూప విలువల మహాగణపతి గ్రంధం మనల్ని కట్టేస్తుందనడంలో సందేహం లేదు.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు,మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ , అల్లు అర్జున్, దిల్ రాజు, సాయి కొర్రపాటి మొదలు ఎందరో ప్రముఖులుఈ గ్రంథ వైభవానికి సమర్పకులుగా ఉండటమంటే ఈ ‘ నిన్నే సేవింతున్ ‘ అద్భుత గ్రంధమెంతగా లక్షల భక్తుల్ని ఆకట్టుకుందో పండిత వర్గాలే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ , విజయవాడ జిల్లాలలో ఈ బుక్ కి వచ్చిన స్పందన అనూహ్యం.
బహుశా తెలుగు ప్రచురణ రంగంలో ఇంతవరకూ ఏ వినాయక చవితికీ ఇలాంటి గ్రంధం రాలేదని నిర్మొహమాటంగా చెప్పాలి. శ్రీనివాస్ మేధ అలాంటిది. శ్రీనివాస్ కష్టం అంతకన్నా గొప్పదని చాలామంది చెపుతున్నారు.

ఎంత దమ్ముండాలి ఇంత గొప్ప పుస్తకాన్ని, ఇంత క్వాలిటీగా , ఇంత సహృదయంతో ఉచితంగా ఇవ్వడానికి. అది నిస్వార్ధంగా నిరూపించారు పురాణపండ శ్రీనివాస్.

ఇక్కడ శ్రీనివాస్ గురించి వాస్తవ అంశాన్నే ప్రస్తావిస్తున్నాం. కఠిన సత్యాన్నే ఆవిష్కరిస్తున్నాం.

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు పురాణపండ శ్రీనివాస్ గ్రంథ వైభవాల అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతూనే వుంది.

ముద్దమందారం సీరియల్ హీరో హీరోయిన్ లు ఈ గణపతి గ్రంధాన్ని అందుకుని పొందిన సంతోషం ఇంతా , అంతా కాదు.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత , ప్రముముఖ నిర్మాత దిల్ రాజు సహృదయ సమర్పణలో ఫిలిం నగర్లో ఈ గ్రంధాల వీర విహారం అద్భుతః. అద్భుతః. దిల్ రాజు ఆఫీస్ ఇంచార్జి కొలను శేషగిరి రావు పర్యవేక్షణలో ఈ గ్రంధాన్ని అనేక మంది సినీ ప్రముఖులకు, ఆలయాల అర్చకులకు, బంధు మిత్ర వర్గాలకు అందించడం వందలమందికి ఆనందం కలిగించింది.

ఇక దైవ కార్యక్రమాలలో, సేవాకార్యక్రమాలలో కీర్తికి దూరంగా సేవ చేసే ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ గణపతి గ్రంధాన్ని సుమారు జంటనగరాలలో వున్న అరవై శాతం ఆలయాలన్నీ కవర్ చెయ్యడం , ప్రింట్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కూడా స్నేహంగా ఇవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

తూర్పు గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాలకొండయ్య పర్య వేక్షణలో అన్ని పార్టీల ప్రతినిధులకు , ప్రభుత్వ అధికారులకూ ఈ ‘ నిన్నే సేవింతున్’ ప్రతులను అందించడం విశేషం. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి ఈ గ్రంధాన్ని ఎంతో ప్రశంసించారు కూడా.

రాజమహేంద్రవరం విఖ్యాత క్రిమినల్ న్యాయవాది ఆనందవేలు తదితర నగర ప్రముఖులకు, బార్ అసోసియేషన్ సభ్యులకు రాజమండ్రి బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు తవ్వల వీరేంద్రనాధ్ సహృదయంతో వితరణ చేశారు. ఈయన సేవా స్పందన అమోఘం. మరొక సేవా ప్రముఖులు చెన్నాప్రగడ శ్రీనివాస్ ఈ పుస్తకాన్ని గోదావరి జిల్లాలలో వితరణ చేసిన తీరు ఎందరో ప్రముఖులచే సెహబాష్ అనిపించింది.

అన్నవరం శ్రీ సత్యదేవుని క్షేత్రంలో వ్రత విభాగంలో అర్చక ప్రముఖులకు కూడా
ఈ మహా గణపతి గ్రంధం కలిగించిన సంతోషానికి వరాల స్వామి సత్యదేవుడే సాక్షి.

ఈ ఒక్క పుస్తకాన్ని తెలుగు రాష్ట్రాలలో ఇరవైయేడు సంస్థలు ఎవరికీ వారే సమర్పించడం అద్భుతమైన పరిణామమనే చెప్పాలి.
ఇలా తెలుగు రాష్ట్రాలలో మొత్తంమీద గణపతి గ్రంధం విజయ ఢంఖా మ్రోగించింది.
ఈ గణపతి నవరాత్రోత్సవాలలో శ్రీనివాస్ కృషిని ఎందరో మనసారా అభినందిస్తున్నారు .
పవిత్ర కార్యం వెనుక కృషి అల్లాంటిది మరి. మనమూ అభినందించాల్సిందే.

ఈ దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా శ్రీనివాస్ బుక్స్ విశేషంగా సందడి చేస్తున్నాయి. మనమూ ఆదరిద్దాం. ప్రోత్సహిద్దాం. సహకరిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు