‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ లాక్!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ లాక్!

Published on Mar 1, 2026 4:31 PM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్స్ శ్రీలీల అలాగే రాశి ఖన్నా కలయికలో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. పవన్ అభిమానులు అలాగే మాస్ ఆడియెన్స్ లో మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ మార్చ్ లోనే రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్లాన్ చేసిన గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

దీని ప్రకారం ఈ మార్చ్ 19 డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అంటే సరిగ్గా సినిమా రిలీజ్ కి వారం గ్యాప్ లో ఈ ఈవెంట్ ని మేకర్స్ ప్లాన్ చేశారు. అలాగే హైదరాబాద్ వేదికగా ఈ సినిమా ఈవెంట్ జరుగుతుంది అని తెలుస్తుంది. దాదాపు శిల్ప కళా వేదికలోనే ఈ ఈవెంట్ ఉండొచ్చట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో యుగానికి ఒక్కడు నటుడు పార్తిబన్ విలన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే మార్చ్ 26 న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు