‘పెద్ది’ పై క్రేజీ అప్డేట్ అందించిన చరణ్.. ఏమది?

‘పెద్ది’ పై క్రేజీ అప్డేట్ అందించిన చరణ్.. ఏమది?

Published on Mar 1, 2026 5:00 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మార్చ్ నేడే మొదలైంది. ఈ నెలాఖరున రామ్ చరణ్ పుట్టినరోజు వస్తుండడంతో ఆల్రెడీ అభిమానులు సోషల్ మీడియాలో చరణ్ మార్చ్ అంటూ హడావుడి కూడా స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ మార్చ్ మొదటి వారం నుంచే సాలిడ్ అప్డేట్స్ కూడా మొదలైన సంగతి తెలిసిందే.

రేపు మార్చ్ 2న సినిమా మాస్ సాంగ్ రాబోతుండగా ఈ గ్యాప్ లో మెగాపవర్ స్టార్ మరో క్రేజీ అప్డేట్ అందించారు. దీనితో ఈ సినిమా డబ్బింగ్ ని తాను మొదలు పెట్టినట్టు తెలిపారు. ఒక్క తెలుగు లోనే కాకుండా అన్ని భాషల్లో కూడా తానే చెప్పుకుంటున్నట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా దర్శకుడు బుచ్చిబాబు సానాతో చరణ్ చికిరి సాంగ్ పై ఫన్నీ కన్వర్జేషన్ కూడా చేయడం ఇందులో ఫ్యాన్స్ కి మంచి కిక్ అందిస్తుంది. ఇక ఈ వీడియోలో ‘ఏమది’ అంటూ సినిమాలో చిన్న డైలాగ్ ని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి డబ్బింగ్ కూడా మొదలైంది. సో ఆన్ టైం ఈ సినిమా రావడం పక్కా అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు