డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ.. మెహబూబా చిత్రం తీశారు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, పూరి మాత్రం తన కుమారుడిని హీరోగా బాగానే ప్రమోట్ చేశాడు. కాగా నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ తన రెండో సినిమా ‘రొమాంటిక్’ చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. బీచ్ వడ్డున మెడ పై హీరోయిన్ని కూర్చో పెట్టుకుని అటు తిరిగి ఉన్న హీరోని చూపిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయనున్నామని చిత్రబృందం తెలిపింది.
ఇక ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. ఈ రొమాంటిక్ మూవీలో బాలీవుడ్ నటి మందిరా బేడీ ఓ కీలక పాత్రలో నటిస్తుందట. అలాగే మరో హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


