‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!

‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!

Published on Aug 16, 2026 1:00 AM IST

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలపై హీరో యశ్ స్పందించారు. తాను అసభ్యతను అస్సలు సమర్థించనని, ఈ సినిమాలో తాను కనీసం ముద్దు సీన్‌లో కూడా నటించలేదని స్పష్టం చేశారు. కేవలం టీజర్‌, పాటల్లోని సన్నివేశాలను విడిగా చూసి అంచనా వేయకూడదని, సినిమాలో వాటి వెనుక ఉన్న భావోద్వేగం కథతో పాటు చూసినప్పుడే స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు.

​ఈ సినిమా కేవలం యాక్షన్, గ్లామర్ అంశాలకే పరిమితం కాదని, జనరేషన్ గ్యాప్ మరియు పాత తరం నియమాలను నేటి తరం ప్రశ్నించే ఆలోచనాత్మక కథాంశంతో వస్తోందని యశ్ వెల్లడించారు. ఈనెల 26న విడుదల కానున్న ఈ చిత్రానికి విమర్శలతో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు