సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి చేయబోయే సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ హాల్ చల్ చేస్తోంది.
సురేందర్ రెడ్డి తన తదుపరి సినిమాని వెంటనే స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి తన తదుపరి సినిమాను హీరో నితిన్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాలి. ఇప్పటివరకూ అయితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని కూడా వినిపిస్తోంది. ఏమైనా సైరా లాంటి భారీ హిస్టారికల్ మూవీ తీశాక.. సురేందర్ రెడ్డి వెంటనే మిడియమ్ రేంజ్ మూవీ చేయాలనుకోవడం మంచి నిర్ణయమే.


