స్త్రీ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వర్మ

స్త్రీ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వర్మ

Published on Oct 2, 2019 10:00 PM IST

Ram Gopal Varma

గాంధీ జయంతి సందర్భంగా వర్మ నేడు తన రూపం మార్చుకున్నాడు. అలాగే పేరు కూడా మార్చేశాడు. గాంధీలో రూపంలోకి మారిన వర్మ పేరుకూడా గాంధీని పోలిన పేరుగా మార్చుకున్నాడు. గాంధీజీ పూర్తి పేరైన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీని ..,గోపాల్ దాస్ వర్మచంద్ రాందీ గా మార్చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. గాంధీ లాంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటీష్ పాలన నుండి మనకు విముక్తి కలిగించారు. ఐతే వారికి కూడా తెలియని విషయం ఏమిటంటే స్త్రీ బానిసత్వం పోగొట్టడానికి, వారి విలువల కోసం పోరాడుతున్నది రామ్ వర్మ అని పోస్ట్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ మానసిక స్థితి ఏమిటో అర్థం చేసుకోవడం ఎవరి తరం కావడం లేదు. ఆయన గాంధీ జయంతి పై కూడా ఇలాంటి పోస్ట్ లు పెట్టాల్సిన అవసరం ఏముంది?. ఎందుకు ఇలాంటి చవకబారు ప్రచారం ఆయన కోరుకుంటున్నారో ఎవరికీ అర్థం కానీ ప్రశ్న. మరి ఈయన తెలుగు రాష్ట్రాలలో రెండు కులాలను ఉద్దేశిస్తూ చేస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఎన్ని వివాదాలు రాజేయనుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు