లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ పుట్టినరోజు నేడు. 1954లో నవంబర్ 7న జన్మించిన కమల్ హాసన్ నేడు 65వ వసంతంలోకి అడుగిడనున్నారు. ఈ పుట్టినరోజుకి మరో ప్రత్యేకత కూడా ఉంది కమల్ హాసన్ నటుడిగా 60ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. ఐదేళ్ల ప్రాయంలోనే కమల్ హాసన్ 1960లో మొదటిసారి సావిత్రి, జెమిని గణేష్ నటించిన కాలాతూర్ కన్నమ్మ చిత్రంలో బాలనటుడిగా నటించడం జరిగింది. లోకనాయకుడిగా పేరొందిన కమల్ హాసన్ మూడు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. పద్మశ్రీ, మరియు పద్మభూషణ్ వంటి కేంద్ర ప్రభుత్వ అవార్డులచే సత్కరించబడ్డారు. కమల్ హాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి.
ప్రస్తుతం కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. పుట్టినరోజు సంధర్భంగా మూవీ నుండి ఏదోఒక అప్డేట్ ఉంటుందని అందరూ భావించారు. కారణమేమో తెలియదు కానీ దర్శకుడు శంకర్ భారతీయుడు 2 చిత్రం గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా కమల్ ఫ్యాన్స్ ని నిరాశ పరిచారు. లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2 చిత్రాన్ని నిర్మిస్తుండగా, హీరో సిద్దార్ద్,రకుల్, ప్రియా భవాని భాస్కర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.


