మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ఇరుముడి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే సాలిడ్ పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకుంది. అక్కడ నుంచి అంచనాలు ఏమాత్రం సన్నగిళ్ళకుండా మేకర్స్ జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఇలా ఫైనల్ గా ట్రైలర్ రిలీజ్ కి కూడా తీసుకుని రాగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత ముందుకు తీసుకెళ్లింది అని చెప్పవచ్చు.
అంచనాలు అందుకునేలా సాలిడ్ ట్రైలర్ కట్ తో వదిలిన ఈ వీడియో మరింత పాజిటివ్ సొంతం చేసుకుంది. ఇక నెక్స్ట్ రానున్న ఫుల్ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ లో ఈ ఆగస్టు 21న విడుదల కాబోతోంది.


