‘భార్య‌దేవోభ‌వ’… ఒక హీరోకి ప‌దిమంది హీరోయిన్స్ !

‘భార్య‌దేవోభ‌వ’… ఒక హీరోకి ప‌దిమంది హీరోయిన్స్ !

Published on Nov 24, 2019 3:08 PM IST

bharyadevobhava

డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా తెర‌కెక్కించిన చిత్రం ‘రాగ‌ల 24 గంటల్లో’. కాగా ఈ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రెడ్డి మ‌రో డిఫ‌రెంట్ సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు. ఆయనే తన త‌దుప‌రి చిత్రం గురించి చెప్తూ.. ‘రాగ‌ల 24 గంటల్లో’ చిత్రాన్ని నిర్మించిన ఇదే బ్యాన‌ర్ లో అతి త్వ‌ర‌లో మ‌రో సినిమా చేయ‌బోతున్నాను.

ఆ సినిమా టైటిల్ ‘భార్య‌దేవోభ‌వ‌’. ఇందులో ప్ర‌ముఖ హీరో న‌టించనున్నారు. ప‌ది మంది హీరోయిన్స్ న‌టించ‌నున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన్మెంట్ గా ఉంటుంది. మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్య‌దేవోభ‌వ వ‌లే.. భార్య గొప్ప‌త‌నం తెలియ‌చేసేలా భార్య‌దేవోభ‌వ ఉంటుంది. వ‌చ్చే నెల నుండి సినిమా ప్రారంభం అవుతుంది. పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేస్తాను అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు