మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో రాబోతున్న ‘ఇరుముడి’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమా శబరిమల యాత్రతో సంబంధం లేదని దర్శకుడు స్పష్టం చేశారు.
హీరో చేపట్టిన 41 రోజుల అయ్యప్ప దీక్ష ఆయన జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది, ఆ సమయంలో ఎదురైన సవాళ్లు ఏమిటనేదే కథాంశమని దర్శకుడు వెల్లడించాడు. ఒక లోపమున్న వ్యక్తి అయ్యప్ప దీక్ష తీసుకుంటే మద్యం వదిలేయాల్సి వస్తుందని, ఆ నియమం ద్వారా వచ్చే కాన్‌ఫ్లిక్ట్‌నే ప్రధానాంశంగా తీసుకున్నట్లు తెలిపాడు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా నటించగా జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది.


