హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి తనకెంతో ఇష్టమైన కమర్షియల్ జానర్లోకి రానున్నాడు. వరుసగా ‘సీత, రాక్షసుడు’ లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన ఆయన ఈసారి పక్కా మాస్ నెంబర్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్నారు. సంతోష్ శ్రీనివాస్ గతంలో ‘హైపర్, రభస, కందిరీగ’ లాంటి సినిమాల్ని చేశారు.
కాబట్టి బెల్లంకొండతో చేయబోయే సినిమా కూడా ఆ తరహాలోనే మాస్ మసాలా ఎంటెర్టైనర్ అయ్యుండొచ్చు. ఈ సినిమా కోసం బెల్లంకొండ పూర్తిగా గడ్డం పెంచి, సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. సినిమాలో ఆయన పాత్ర కూడా రా అండ్ రస్టిక్ అనేలా ఉంటుందట. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు, హీరోయిన్ ఎవరు, రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది వంటి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


