అమీర్ ఖాన్ సినిమాలో విజయ్ సేతుపతి..!

అమీర్ ఖాన్ సినిమాలో విజయ్ సేతుపతి..!

Published on Nov 26, 2019 7:56 PM IST

amerkhan

బాలీవుడ్ ఖాన్ త్రయంలో అమీర్ ఖాన్ శైలే వేరు. విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ఇండస్ట్రీ హిట్ అందుకోవం అమీర్ స్టైల్. 3 ఇడియట్స్, పీకే, దంగల్ చిత్రాలే అందుకు ఉదాహరణ.కాగా అమీర్ మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధమయ్యారు. లాల్ సింగ్ చద్దా పేరుతో తెరకెక్కనున్న ఈచిత్రంలో ఫీజికల్లీ మరియు మెంటల్లీ పాక్షికమైన లోపాలు కలిగిన వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అమీర్ సైనికుడిగా చేస్తున్నారు. ఈ మూవీ 1994లో టామ్ హంక్స్ హీరోగా వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ చిత్రానికి అనువాదం. ఆ మూవీ కథను స్ఫూర్తిగా తీసుకొని ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై విశేష స్పందన దక్కించుకుంది .

కాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. కోలీవుడ్ కి చెందిన వర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక రోల్ చేస్తున్నారట. లాల్ సింగ్ చద్దా చిత్రంలో ఓ పాత్రకు విజయ్ ఐతే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించడంతో ఆయనను తీసుకున్నట్లు సమాచారం. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్, కిరణ్ రావ్, వియాకామ్ 18 స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా లాల్ సింగ్ చద్దా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు