ఆకట్టుకొనేలా.. మథనం మూవీలోని ‘చందమామ’ సాంగ్.

ఆకట్టుకొనేలా.. మథనం మూవీలోని ‘చందమామ’ సాంగ్.

Published on Nov 27, 2019 1:31 PM IST

madhanam 1

శ్రీనివాస్ సాయి, భావ‌న‌రావు జంట‌గా అజయ్ సాయి మ‌నికంద‌న్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మథనం. కాశీ ప్రొడక్షన్స్ ప‌తాకంపై దివ్యా ప్రసాద్‌, అశోక్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ టీజర్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. యువ జంట మధ్య నడిచే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో పాటు, యాక్షన్ మరియు ఎమోషనల్ అంశాలతో మిథునం తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. నటుడు అజయ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేయడం విశేషం.

కాగా నేడు మథనం చిత్రంలోని ‘చందమామ..చందమామ…’ అనే సాంగ్ విడుదలైంది. ప్రేయసి కోసం ప్రియుడు పాడే ఎమోషనల్ సోలో సాంగ్ ని ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ కార్తీక్ పాడారు. రాన్ ఈథన్ యోహాన్ స్వరాలకు కార్తీక్ గానం పాటకు మంచి ఫీలింగ్ జత చేసింది. ఇక ఈ పాటను పూర్ణా చారి రాశారు. త్వరలో ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయడంతో పాటు, విడుదల తేదీ ప్రకటించనున్నారు.

సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు