‘చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే’ చిత్రాలతో చిన్న వయసులోనే అత్యంత వేగంగా స్టార్ స్టేటస్ అందుకున్న హీరో ఉదయ్ కిరణ్ వ్యక్తిగత కారణాల రీత్యా 2014లో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. ఈయన జీవితం ఆధారంగా బయోపిక్ తీస్తున్నట్టు పలుసార్లు పుకార్లు వచ్చాయి. తాజాగా కూడా ఈ బయోపిక్ అంశం చర్చకు వచ్చింది.
యువహీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో ఈ బయోపిక్ రూపొందుతుందని, సందీప్ కిషన్ సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నారని బలమైన వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన సందీప్ కిషన్ అసలు ఈ బయోపిక్ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని, అసలు తనకిప్పుడు బయోపిక్ సినిమాలు చేసే ఉద్దేశ్యం లేనే లేదని క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగుతాయేమో చూడాలి.


