హైదరాబాద్; నవంబర్: 29
మహా సరస్వతీమాత ఏం అనుగ్రహం వర్షిస్తోందో కానీ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మంగళగ్రంథాలు తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల భక్త పాఠకుల్ని ఆధ్యాత్మికత్వంతో , మంత్ర శక్తులతో, ప్రసన్నత్వంతో , భక్తి తత్వంతో పరశింపచేస్తున్నాయి. నగరాల, పల్లెల ఆలయాలలో … భక్త బృందాల పారాయణల్లో … అర్చక సమూహాల ప్రార్థనల్లో, వేదపండితుల స్వరాలమధ్య పురాణపండ శ్రీనివాస్ పుస్తకాలు మహాసౌందర్యంతో పరమేశ్వరుణ్ణి దర్శింపచేస్తున్నాయి. ఎన్నో మంగళ శుభ కార్యాలలో సైతం హిందువులు శ్రీనివాస్ బుక్స్ ని కానుకలుగా పంచడం కూడా కనిపిస్తోంది.
పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనలైన ‘యుగే యుగే ‘ , ‘ అమ్మణ్ణి ‘, ‘ శరణు శరణు’, ‘ నేనున్నాను’, ‘ ననుగన్న నాతండ్రి ‘ , ‘ మహా మంత్రస్య’ ,’ శ్రీపూర్ణిమ’ గ్రంధాలు ఎంతగా తెలుగురాష్ట్రాల్ని వుర్రూతలూగించాయో మనకి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం లలో జరిగిన ఎన్నో మంగళ కార్యాలలో , కళాశాలల వేడుకల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో, దేవీ దేవతా ఉత్సవాలలో కూడా మేధో సమాజం పురాణపండ శ్రీనివాస్ బుక్స్ ని బహుమతులుగా పంచుతోంది. స్వీకరించిన విజ్ఞులన్తా బుక్స్ ని చూసి తెగ సంబరపడుతున్నారు. ఇటీవల కాకినాడ, హైదరాబాద్, విజయవాడ లలో జరిగిన కొన్ని వనభోజనాల వేడుకలలో , కార్తీక దీపారాధానా ఉత్సవాలలో కూడా శ్రీనివాస్ బుక్స్ దే పైచేయి అని విజ్ఞులంతా ప్రశంసలతో ఆశీర్వదించడమొక సత్యం.
శ్రీనివాస్ బుక్స్ లోని ఆకర్షణ శక్తి, పవిత్ర విలువలు, నిస్వార్ధ తత్త్పరత , రచనా శైలీ సోగసుల విన్యాసం, ముద్రణా నాణ్యత వీటన్నిటికీ మించి ఎంతో మర్యాదతో బుక్స్ ని ఉచితంగా ఇచ్ఛే మర్యాదాతత్వం మనల్ని శ్రీనివాసుకి చాలా సన్నిహితుల్ని చేస్తాయి. అనిర్వచనీయమైన అనుభూతిని అడుగడునా పంచే ఒక ఆత్మ సాక్షాత్కార మానవీయ హృదయం పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలలో దర్సనమిస్తుందని మనకు యిట్టె తెలుస్తుంది. ఇటీవల పురాణపండ శ్రీనివాస్ ‘ అమ్మణ్ణి ‘ పవిత్ర గ్రంధాన్ని అందుకున్న ప్రఖ్యాత గాయని , ‘ పద్మ భూషణ్ ‘ పి.సుశీల ‘ ఇంతవరకూ ఇలాంటి మహత్తుల గ్రంధాన్ని చూడలేదని, ఈరోజు సాక్షాత్తూ అమ్మవారే ఈ పుస్తకంలో తనకు దర్శనమిస్తోందన్నారు’. పురాణపండ శ్రీనివాస్ గ్రంధంలో ఏదో మహత్వ భావన తనని పులకింపచేస్తుందని పి.సుశీల ఈ సందర్భంలో చెప్పడం అక్కడి వారందరినీ ఆకట్టుకుంది. ఇలాంటి ఎన్నో అమోఘ విశిష్టతలని మనకి శ్రీనివాస్ అందివ్వాలని ఆమె అభినందనలందజేశారు.
తన పుస్తకం కోసం భక్తపాఠకుడు ఆత్రుతపడేలా చెయ్యడమే పురాణపండ శ్రీనివాస్ కృషీవలత్వం. యజ్ఞ భావన. కఠోర సాధన. నిష్కపటత్వం. నిస్వార్ధ సేవాతత్వం. కాబట్టే పురాణపండ శ్రీనివాస్ బుక్స్ కోసం స్పాన్సర్స్ వెల్లువలా పోటెత్తుతున్నారు. పుస్తక సమర్పకులు ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా … ఇంకా నాల్గు బుక్స్ ఎక్కువే అందింది మర్యాదగా పంపడమే శ్రీనివాస్ విజయం. ఇంకొక ముఖ్యాంశమేమంటే హైదరాబాద్ పుప్పాలగూడ భాగ్యలక్ష్మీకాలనీలో ఇటీవల జరిగిన వనభోజన పవిత్ర కార్యక్రమంలో కూడా జంట నగరాల ప్రముఖులైన కె. ముక్తేశ్వరరావు సారధ్యంలో ఎంతోమంది ప్రముఖులకు ఈ ‘ శ్రీ పూర్ణిమ’ గ్రంధాన్ని కార్తీక మాసపు కానుకగా అందించి భగవంతుని అనుగ్రహాన్ని పొందారని చెప్పాలి. మేధావులు, సంగీత ప్రముఖులు, రసజ్ఞులు, సాహితీవేత్తలు పాల్గొన్న ఈ అద్భుత వేడుకలో పుస్తకాలు పంచిన , సమర్పించిన ముక్తేశ్వరరావు విజ్ఞతనే అడగండి. ఆయనే చెబుతారు ఈ అపురూప గ్రంధాల వైభోగాల్ని.
తెలుగు నాట ఒక వ్యక్తి ఇన్ని పుస్తకాలను , ఇంత అద్భుతంగా అందించడం, రచించడం, సంలకీరచడం, ఇంత సౌందర్యంగా ముద్రించడం … అందులోనూ సౌజన్యవంతుల ప్రోత్సాహంతో ఇంత భారీ మంగళ గ్రంథాల్నీ ఉచితంగా ఇవ్వడం ఆషామాషీ వ్యవహారంకాదు. ఈ మహా విజయం రెండురాష్ట్రాలలో ఒక్క పురాణపండ శ్రీనివాస్ ప్రతిభ లో మాత్రమే కనిపిస్తుంది. భూతద్దం పెట్టి వెతికినా మరొకడు ఈ రకంగా విభిన్నంగా , అస్సలు స్వార్ధంలేకుండా కనిపించరు. కనిపించబోరు. నోడౌట్ . పురాణపండ ప్రజ్ఞకు హ్యాట్సాఫ్ .





