ఆ ఘోర కలికి వ్యతిరేకంగా గళమెత్తిన టాలీవుడ్

ఆ ఘోర కలికి వ్యతిరేకంగా గళమెత్తిన టాలీవుడ్

Published on Nov 29, 2019 2:55 PM IST

priyanka reddy

వెటనరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిని మరో నిర్భయ ఘటనగా వర్ణిస్తున్నారు. గత బుధవారం శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద గల టోల్ ప్లాజా సమీపంలో ప్రియాంక రెడ్డి కి చెందిన స్కూటీ పంక్చర్ ఐయ్యిందనీ, పక్కనే ఉన్న షాప్ దగ్గర పంక్చర్ వేయించి తీసుకొస్తామని చెప్పి ఆమెను పక్కదారి పట్టించారు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు, చంపి అక్కడి నుండి దూరంగా తీసుకెళ్లి కాల్చి వేశారు. ఈ ఘటన జరగడానికి ముందు ప్రియాంక తన సోదరితో మాట్లాడిన మాటలు కలచివేస్తున్నాయి.

ఈ ఘటనపై అన్నివర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. ఈ కిరాతకానికి పాల్పడినవారికి పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అలాగే టాలీవుడ్ కి చెందిన చాలా మంది ప్రముఖులు దీనిపై స్పందించారు. కీర్తి సురేష్, లావణ్య త్రిపాఠి, మెహ్రిన్ పిర్జా, అల్లరి నరేష్, సుధీర్ బాబు,పూనమ్ కౌర్ వంటి వారు ఈ ఘటనకు వ్యతిరేకంగా ట్వీట్స్ వేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు