పవన్ చేతుల మీదుగా కలియుగ మూవీ సాంగ్స్ జ్యూక్ బాక్స్ విడుదల

పవన్ చేతుల మీదుగా కలియుగ మూవీ సాంగ్స్ జ్యూక్ బాక్స్ విడుదల

Published on Nov 29, 2019 5:04 PM IST

pawan

కలియుగ మూవీ ఆడియో జ్యూక్ బాక్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కలియుగ మూవీ చిత్ర యూనిట్ ఆయన నివాసంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ తమ వినతి మన్నించి కలియుగ చిత్ర ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల చేసినందుకు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు చిత్ర యూనిట్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కలియుగ మూవీ సాంగ్స్ వినడంతో పాటు, చాలా బాగున్నాయని ప్రశంసించారు. అలాగే కలియుగ మూవీ మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్ కి శుభా కాంక్షలు తెలిపారు.

రాజా , స్వాతి దీక్షిత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్ ఏ తిరుపతి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య ప్రసాద్ నిర్మిస్తుండగా, డి కమల్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విశ్వ, సాయి, సూర్య ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మూవీ పాటలు విడుదల చేయడం వలన కలియుగ చిత్రానికి మంచి ప్రచారం కలుగుతుంది అనడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు