వర్మ సినిమా అందరూ అనుకున్నట్లు అలా ఉండదట..!

వర్మ సినిమా అందరూ అనుకున్నట్లు అలా ఉండదట..!

Published on Nov 29, 2019 9:00 PM IST

Kamma Rajyamlo Kadapa

రోజుకో వివాదం పూటకో గొడవతో సాగుతున్న వర్మ మూవీ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ విడుదలకైతే బ్రేక్ పండింది. నేడు ఈ చిత్రం విడుదల కావాల్సివుండగా, సెన్సార్ క్లియర్ కాకపోవడంతో విడుదలకు నోచుకోలేదని తెలుస్తుంది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ విడుదల వాయిదాపై స్పష్టత ఇచ్చేందుకు చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది.

కాగా మిడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ నేను కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ చిత్రం తీయలేదు. అలాగే ఒక కులం ఎక్కువ, మరో కులం తక్కువ అనేలా కూడా ఈ చిత్రం ఉండదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఒక కల్పిత గాధ మాత్రమే అన్నారు. మీరు అనుకున్నట్లు ఒకరిని ఎక్కువగా, మరొకరిని తక్కువగా చూపించలేదు అని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు